Hyderabad, ఏప్రిల్ 29 -- విజయం పొందాలంటే దగ్గరి దారులు ఉండవు. కష్టపడడం ఒక్కటే దారి. విజేతగా మారేందకు ఒక వ్యక్తికి ఏం కావాలో తెలుసుకునేందుకు అధ్యయనం జరిగింది. నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ఇటీవల చేసిన అధ్యయనంలో విజయానికి అంతిమ రెసిపీని కనుగొన్నారు.

వాస్తవానికి, ఎక్కువ సంకల్ప శక్తి ఉన్నవారు విజయాన్ని సాధిస్తారని అధ్యయనం చెబుతోంది. అటువంటి వ్యక్తులకు ఒక సారూప్యత ఉంది. ఇది సానుకూల మనస్తత్వం.

13 నుంచి 77 ఏళ్ల మధ్య వయసున్న 1,500 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొనే వారి అభిరుచి, పట్టుదల, మనస్తత్వాన్ని కొలవడానికి ఒక ప్రశ్నావళిని ఇచ్చి సమాధానం ఇవ్వమని కోరారు పరిశోధకులు. ముఖ్యంగా అత్యధిక, అత్యల్ప మైండ్ సెట్ స్కోర్లను కొలిచారు. సానుకూల దృక్పథం ఉన్నవారికి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవారిని పరిశోధ...