Andhrapradesh,telangana, ఆగస్టు 18 -- విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై కి.మీ మేర వాహనాల రద్దీ ఉంది. భారీ స్థాయిలో వాహనాలు బారులు తీరాయి. వరస సెలవులు రావడంతో సొంత గ్రామాలకు వెళ్లిన వాళ్లు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే హైవేపై రద్దీ నెలకొంది.

నల్గొండ జిల్లా పరిధిలోని పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు భారీగా ట్రాఫిక్ జామ్‌ పరిస్థితులు ఉన్నాయి. చౌటుప్పల్ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి వద్ద కొత్త నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులతో మరింత ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సులను మునుగోడు, సంస్థాన్ నారాయణపురం మీదుగా చౌటుప్పల్ హైవేకు మళ్లిస్తున్నారు. రద్దీ మరింత ఎక్కువ కాకుండా. అధికారులు ఎప్పటికప్...