భారతదేశం, జనవరి 12 -- విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ సన్నిధిలో అపచారంపై ఆలయ ఈవో శీనా నాయక్ స్పందించారు. ఈ ఘటనపై బాధ్యులకు మెమోలు జారీ చేశారు. ఇప్పటికే అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేసిన కమిటీ.. నివేదికను ఈవోకు అందజేసింది. అమ్మవారి అభిషేకం కోసం ఉపయోగించిన పాలలో పురుగులు ఉన్నట్టుగా కమిటీ గుర్తించింది.

అంతేకాదు అభిషేకానికి వాడిని బిందె పరిశుభ్రంగా లేకపోవడమే ఘటనకు కారణం అని కమిటీ నిర్ధారించింది. పురుగులు ఉన్న బిందెలో పాలు పోసి అభిషేకం చేసినట్టుగా తెలిసింది. ఈ అపచార ఘటనలో భాగంగా స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి నోటీసులు జారీ అయ్యాయి. ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవు పాలు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈవో. ఈ ఘటన గురించి ఆలయ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం తప్పని...