భారతదేశం, అక్టోబర్ 12 -- ఏపీ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లేందుకు ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సేవలను ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.

"విజయవాడ మరియు సింగపూర్ చాంగి విమానాశ్రయం మధ్య నూతన అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి అనుసంధానం చేయడానికి మరింతగా ఉపయోగపడుతుంది . నవంబర్ 15వ తేదీ నుండి ఇండిగో విమాన సంస్థ వారానికి మూడు రోజులు (మంగళవారం, గురువారం, శనివారం) పాటు ఈ విమాన సర్వీసులను అందించనుంది" అని కేంద్రమంత్రి రామ్మోహన్ న...