భారతదేశం, మే 22 -- విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుపై కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో మెట్రో నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విశాఖ మెట్రో కు సంబంధించి అక్టోబర్ నెలలో పనులు మొదలుపెడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. డబుల్ డెక్కర్ మెట్రో కింద డిపిఅర్ ఇచ్చినట్టు తెలిపారు. కోటి మంది ప్రజానీకం ఉన్న హైదరాబాద్ కు రింగ్ రోడ్డు ఉందని అదే తరహాలో విశాఖలో సెమీ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అయ్యేలా పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుందని భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అనుసంధానం చేస్తూ 22 రోడ్లు ప్రతిపాదించామని, వాటి...