భారతదేశం, జూన్ 12 -- ఆలయాల్లో నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దానం చేసిన భూములతో ట్రస్టీలు సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని హిందుస్థాన్‌ టైమ్స్‌ గత ఏప్రిల్‌లో వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వాన్ని మభ్య పెట్టేలా దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరును బయట పెట్టింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ అక్రమార్కులకు సహకరిస్తున్న వైనాన్ని ఎండగట్టింది.

ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్‌‌కు అర్చకులు ఫిర్యాదు చేయడంతో దేవాదాయ శాఖ దర్యాప్తుకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ను సైతం ఏమార్చేందుకు ప్రయత్నాలు జరిగినా.. భవిష్యత్తులో కోర్టులో దోషులుగా నిలబడాల్సి వస్తుందనే కారణంతో ఎట్టకేలకు ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. పూర్తి స్థాయి ఈవోను నియమించారు.

హిందూ ధర్మ పరిరక్షణ, అధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో ధూపదీప ...