భారతదేశం, ఏప్రిల్ 30 -- తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి విజయవాడలో జరిగిన వివాహానికి హజరయ్యారు. ఉన్నారు. కంకిపాడులో జరిగిన మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహానికి సీఎం హాజరయ్యారు. నగర శివార్లలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డికి పలువురు మంత్రులు స్వాగతం పలికారు.

కంకిపాడులో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కుమారుడు వివాహానికి హాజరయ్యేందుకు విజయవాడకు వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు , బీసీ జనార్థన్ రెడ్డి స్వాగతం పలికారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా - అనుపమ దంపతుల కుమారుడు నిహార్, అనుమోలు రవికుమార్ - నీరజ దంపతుల ఏకైక కుమార్తె శ్రీ సాయి నర్మద ల వివాహం బుధవారం కంకిపాడులోని కళ్యాణ మండపంలో జరిగింది.

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడి క...