Andhrapradesh, సెప్టెంబర్ 14 -- విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 300కు పైగా దాటింది. మరోవైపు విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 140కి పైగా ఉంది.

డయేరియా విజృంభిస్తుండటంతో. కాలనీ వాసులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. మరోవైపు స్థానికంగా నెలకొన్న పరిస్థితులు వైద్యారోగ్యశాఖ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. శానిటేషన్ తో పాటు ఇతర కారణాలను అన్వేషిస్తున్నారు. బాధితుల నుంచి కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు.

డయేరియాకు కలుషిత నీరే కారణమని స్థానికుల గగ్గోలు పెడుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని కోరుతున్నారు. అందరికీ ఆహారం, వైద్యం, వైద్య ఖర్చులు చెల్లింపులు చేయాలని విజ్ఞ...