భారతదేశం, మే 24 -- ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో తీవ్ర విషాదం జరిగింది. శనివారం ఉదయం కరెంట్ షాక్ వల్ల ముగ్గురు చనిపోయారు. ఒకరినొకరు కాపాడుకోబోయి.. అలా ముగ్గురు మరణించారు. సలాది ప్రసాద్, తరవలి ముత్యావల్లి, సలాది వెంకట హేమవాణి కరెంట్ షాక్‌తో మృతిచెందారు. వీరు బెంజ్ సర్కిల్ ఏరియాలోని నారా చంద్రబాబునాయుడు కాలనీ సాయి టవర్స్‌లో నివాసం ఉంటున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సలాది ప్రసాద్ లారీ డ్రైవర్. అతని చెల్లెలు తరవలి ముత్యావల్లి. ఈ ఘటన గురించి తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో.. నారా చంద్రబాబునాయుడు కాలనీలో విషాదం నెలకొంది.

సాయి టవర్స్‌లో దంపతుల...