భారతదేశం, డిసెంబర్ 18 -- విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం(కనక దుర్గ ఆలయం) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దర్శన టికెట్లతోపాటుగా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు దేవస్థానం.. భక్తులకు పారదర్శకతను పెంచడానికి, సౌకర్యార్థం త్వరలో మెుత్తం ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ఈ వివరాలు వెల్లడించారు.

దర్శనం టిక్కెట్లు, సేవా బుకింగ్‌లు, ప్రసాదం, విరాళాలు, రిజిస్ట్రేషన్లు త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని దేవస్థానం వెల్లడించింది. ముందుగానే టిక్కెట్లను బుక్‌ చేసుకునేందుకు www.kanakadurgamma.org, www.aptemples.ap.gov.in వెబ్‌సైట్లులో బుక్ చేయవచ్చు. లేదంటే కనకదుర్గమ్మ ఆలయ మొబైల్‌ యాప్‌, మనమిత్ర వాట్సప్‌ సేవ 9552300009 కూ...