భారతదేశం, మే 14 -- విజ‌య‌వాడ‌,విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విభజన చట్టంలో భాగంగా విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో నిర్మాణం జరగాల్సి ఉన్నా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టులపై కొత్త డీపీఆర్‌లపై కసరత్తు జరిగింది. ఎంపిక చేసిన కారిడార్లలో మెట్రో రైళ్లను పరుగులు తీయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టుకు అవసరమై నిధులు సమీకరించేందుకు మెట్రో రైల్ కార్పొరేషన్‌ ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు వచ్చాయి. ప‌లు విదేశీ బ్యాంకుల ప్ర‌తినిధుల‌తో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్టారెడ్డి స‌మావేశమయ్యారు.

KFW, AFD, ADB, NDB, AIIB, జైకా, ప్ర‌పంచ...