Andhrapradesh,tirumala, అక్టోబర్ 2 -- తిరుమల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంగా నిర్వహించారు. సామాన్య భ‌క్తుల‌కు ఎలాటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అన్ని విభాగాలు సమిష్టిగా , స‌మ‌న్వ‌యంతో సేవ‌లందించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరాలను వెల్లడించారు. టీటీడీ సిబ్బంది సంయ‌మనంతో, ప్ర‌ణాళిక బ‌ద్ధంగా, సీనియ‌ర్ అధికారుల ప‌ర్యవేక్ష‌ణ‌లో సేవ‌లందించార‌ని తెలిపారు.

శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను దిగ్విజ‌యం చేసిన టీటీడీ అర్చ‌క స్వాముల‌కు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీ‌వారి సేవ‌కులు, మీడియా, భ‌క్తుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి బ్ర‌హ్మోత్ప‌వాల‌కు విచ్చేసిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు 16 శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పించామని తెలిపారు...