భారతదేశం, మే 16 -- హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ నిపుణుల బృందం అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఏడేళ్ల విదేశీ చిన్నారి జీవితాన్ని రక్షించింది. గతంలో అనేక ఆసుపత్రులలో చికిత్స కోసం ప్రయత్నించినా.. ట్యూమర్ స్థానం సంక్లిష్టంగా ఉండటంతో శస్త్రచికిత్స సాధ్యపడదని వైద్యులు నిరాకరించారు.

బాధిత చిన్నారి మెదడు స్టెమ్ ప్రాంతంలో అరుదైన, ప్రమాదకరమైన ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెదడు స్టెమ్ అనేది అత్యంత సున్నితమైన ప్రాంతం. చిన్న పొరపాటు చేసినా.. తీవ్ర న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు వివరించారు. ఈ క్లిష్టమైన కేసును సీనియర్ న్యూరో కన్సల్టెంట్ డా.శ్రీకాంత్ రెడ్డి స్వీకరించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ట్యూమర్‌ను పూర్తిగా తొలగించారు.

శస్త్రచికి...