భారతదేశం, మే 20 -- తెలుగు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారనే అభియోగాలతో పోలీసులు అరెస్ట్‌ చేసిన యువకుల వ్యవహారంపై ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. గ్రూప్‌ 2 కోచింగ్‌ కోసం హైదరాబాద్ వెళ్లి ఉగ్రవాదం వైపు మళ్లిన సిరాజ్‌ అనే యువకుడితో పాటు హైదరాబాద్‌కు చెందిన సమీర్‌లను విజయనగరం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్ల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. తాజాగా విజయనగరం చేరుకున్న ఎన్‌ఐఏ దర్యాప్తు బృందాలు నిందితులను ప్రశ్నిస్తున్నాయి. నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించేందుకు వారిని కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతి కోరారు.

పోలీస్‌ ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉగ్రవాదం వైపు మళ్లిన విజయనగరం యువకుడి విషయంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు పదార్ధాలను సేకరించి బాంబు పేలుళ్...