భారతదేశం, జనవరి 26 -- తెలుగులో హీరోయిన్స్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఒక్క సినిమాతో మంచి ఫామ్‌లోకి వస్తే చాలు బ్రాండింగ్ ప్రమోషన్స్, ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాలతో బిజీ అయిపోతుంటారు. ఇప్పుడు అలాగే ఓ కొత్త హీరోయిన్ బిజీ అయిపోతున్నారు. ఆమెనే రితికా నాయక్.

మిరాయి సినిమాలో హీరోయిన్‌గా చేసిన రితికా నాయక్ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అంటూ యూత్‌ను తెగ అట్రాక్ట్ చేశారు. ఒక్క మిరాయితో మంచి క్రేజ్ తెచ్చుకున్న రితికా నాయక్ తాజాగా ఓ జ్యూవెలరీ షోరూమ్‌ను ప్రారంభించారు.

మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్‌ సిల్వర్‌ జ్యువెలరీ షో రూమ్ విజయనగరం ఎంజీ రోడ్డులోని 21వ స్టోర్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ షోరూమ్‌నే టాలీవుడ్ బ్యూటిఫుల్ రితికా నాయక్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా హీరోయిన్‌ రితికా నాయక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతేకాక...