Hyderabad, జూన్ 18 -- వినయం అనేది వ్యక్తిత్వ లక్షణం. వినయం ఉంటే ఆ మనిషిని గౌరవిస్తారు. వారిని ప్రత్యేకంగా చూస్తారు. వినయమే మనిషికి అందం. వినయమే అభివృద్ధి మంత్రం. 'వినయం విద్యాదాతి' అంటారు. వినయం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందగలడు. ప్రతి వ్యక్తి విజయాన్ని సాధించాలని కోరుకుంటాడు, కానీ వినయం లోపిస్తే, విజయం కూడా అతనికి చాలా దూరంలో ఉంటుంది.

ఒక వ్యక్తి అభివృద్ధి వైపు పయనిస్తున్నప్పుడు, ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. వినయపు కవచం ధరించిన వ్యక్తి మాత్రమే వాటి అన్నింటినీ దాటగలడు. వినయం ఒక వ్యక్తిని అనేక రకాల సమస్యల నుండి రక్షిస్తుంది. అలాగే ఏ మనిషిలో కూడా అహంకారం ఉండకూడదు. అహంకారం ఎంత ప్రమాదం అంటే.. అది మనిషిలోని సద్గుణాలన్నీ తీసేస్తుంది. అహంకారం ఏ విషయంలోనూ మంచిది కాదు.

వినయం అనేది ఒక వ్యక్తి తన ప్రతి లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే ...