భారతదేశం, మే 9 -- రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. జమ్మూ, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం జరగడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ కింద భారత్ ఇటీవల జరిపిన సీమాంతర దాడుల తర్వాత భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి ఈ సమావేశం జరిగింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జరిపిన సమావేశం దృశ్యాలు క్షణాల్లో వైరల్ గా మారాయి. నవ్వుతూ వారు మాట్లాడుకుంటున్న దృశ్యాలను పెద్ద ఎత్తున షేర్ చేశారు. పాకిస్తాన...