భారతదేశం, జనవరి 5 -- తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. హరీష్‌ను ప్రతివాదిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేసింది. అయితే ఈ సందర్భంగా హరీష్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. విచారణ అవసరం లేదని చెప్పింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా జస్టి్స్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించారు.

మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సీనియర్ పోలీసు అధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ డిసెంబర్ 2024లో పంజాగ...