భారతదేశం, సెప్టెంబర్ 28 -- మారుతీ సుజుకీ విక్టోరిస్​ని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. విక్టోరిస్ రాకతో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా పాతబడినట్లు అనిపిస్తుందా, లేక ఈ రెండింటికి మార్కెట్లో వేర్వేరు స్థానాలు ఉంటాయా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి ఏది బెస్ట్​ అన్నది తెలుసుకుందాము..

విక్టోరిస్ ప్రారంభ ధర సుమారు రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది సెగ్మెంట్‌లోని అత్యంత అగ్రెసివ్​ ప్రైజ్​ నిర్ణయించిన ఎస్‌యూవీలలో ఒకటి. కేవలం ప్రత్యర్థులనే కాక, తమ సొంత గ్రాండ్ విటారా కంటే తక్కువ ధర ఉండేలా మారుతీ సుజుకీ చాలా స్పష్టంగా దీని ధరను నిర్ణయించింది!

వేరియంట్‌ను బట్టి చూస్తే.. విక్టోరిస్ గ్రాండ్ విటారాలోని అదే ట్రిమ్స్‌తో పోలిస్తే దాదాపు రూ. 92,000 వరకు తక్కువ ధరకు లభిస్తుంది. కేవలం ఈ ధర వ్యత్యాసం మాత్రమే...