భారతదేశం, ఏప్రిల్ 23 -- ముల్తాన్ సుల్తాన్స్, లాహోర్ ఖలందర్స్ మధ్య మంగళవారం (ఏప్రిల్ 23) రాత్రి జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పేసర్ తన తోటి క్రికెటర్ తలపై కొట్టడం వింతగా మారింది. ముల్తాన్ సుల్తాన్స్ పేసర్ ఉబైద్ షా.. అనుకోకుండానే తన టీమ్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ తలపై కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పీఎస్ఎల్ 2025లో లాహోర్ ఖలందర్స్ ఛేజింగ్ లో సామ్ బిల్లింగ్స్ ను ఉబైద్ షా ఔట్ చేశాడు. ఈ వికెట్ పడగొట్టిన ఆనందంతో ఉబైద్ సంబరాలు చేసుకున్నాడు. ఆ జోష్ లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ తలపై అనుకోకుండా కొట్టాడు. ఉస్మాన్ ఖాన్ చేతులు ముందుకు తేగా.. వాటి మధ్యలో నుంచి ఉబైద్ తలమీద బలంగా కొట్టాడు. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025లో ఈ ఘటన జరిగిన సమయంలో...