భారతదేశం, నవంబర్ 2 -- వికారాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 40 ఏళ్ల వ్యక్తి తన భార్య, కుమార్తె, వదినను హత్య చేశాడు. అంతేకాదు ఆపై అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరో కుమార్తె అతడి దాడి నుంచి తప్పించుకోగా. గాయాలయ్యాయి.

తెల్లవారుజామున 2.30 నుంచి 3 గంటల మధ్య కుల్కచర్ల మండల పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన గురించి 'డయల్ 100' ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

వేపూరి యాదయ్య, ఆయన భార్య అలివేలు(32) మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం రోజు కూడా గొడవ పడ్డారు. వీరికి సర్దిచెప్పడానికి అలివేలు సోదరి హన్మమ్మ(40) వారి ఇంటికి వచ్చింది. రాత్రి ఇక్కడే ఉంది. ఈ క్రమంలో రాత్రి వారంతా నిద్రిస్తుండగా. యాదయ్య కత్తితో దాడి చేశాడు.

భార్య అలివేలు, వదిన హన...