భారతదేశం, జనవరి 28 -- వికారాబాద్‌ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని ఓ కుమార్తె.. ఏకంగా తల్లిదండ్రులను హత్య చేసింది. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని తొలుత భావించినా.. పోలీసుల విచారణలో కుమార్తె బండారం బట్టబయలైంది. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటికొచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ నర్సింగ్ హోంలో నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే వేర్వురు కులాలు కావటంతో. తల్లిదండ్రులు వివాహనికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే మరో యువకుడితో సురేఖకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. దీంతో తల్లిదండ్రులపై కుమార్తె సురేఖ కక్ష పెంచుకుంది. ఎలాగైనా వాళ్...