భారతదేశం, జనవరి 26 -- 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిందన్నారు. ఈ డాక్యుమెంట్ హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా మారాలనే తెలంగాణ దార్శనికత.. వికసిత్ భారత్‌కు అనుగుణంగా ఉందన్నారు గవర్నర్.

'2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకోవాలని వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పత్రాన్ని గత ఏడాది డిసెంబరులో ప్రపంచ నాయకులు, పెట్టుబడిదారుల సమక్షంలో ఆవిష్కరించారు. విజన్ 2047 డాక్యుమెంట్‌లో మూడు జోన్‌లు ఉన్నాయి. క్యూర్, ప్యూర్, రేర్. 2047 నాటికి భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస...