భారతదేశం, మే 6 -- వాట్సప్ వీడియో కాల్ వైద్యం వికటించి.. గర్భంలోనే కవలలు మృతిచెందారు. పెళ్లైన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతోందని ఆనందపడ్డ ఆ దంపతులకు గర్భశోకం మిగిలింది. ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని.. ఎక్కడో ఉన్న వైద్యురాలు నర్సుకు వీడియో కాల్ ద్వారా సూచించింది. ఆ వైద్యం వికటించిన కవలలు మృతిచెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది.

ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్, కీర్తిలకు ఏడేళ్ల కిందట వివాహం అయ్యింది. కానీ సంతానం కలగలేదు. దీంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనూషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకున్నారు. ఈ క్రమంలో కీర్తి గర్భం దాల్చింది. 5 నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో.. అదే ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు.

కీర్తిని ఆసుపత్రికి తీసుకొచ్చిన స...