భారతదేశం, జూలై 12 -- వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్ ను ఇగా స్వియాటెక్ సొంతం చేసుకుంది. శనివారం (జూలై 12) లండన్ లో జరిగిన ఫైనల్లో ఈ పోలండ్ అమ్మాయి స్వియాటెక్ 6-0, 6-0 తేడాతో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవాపై ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచి చివరి వరకు పూర్తి నియంత్రణలో ఉన్న ఈ పోలిష్ ఎనిమిదో సీడ్ తన ప్రత్యర్థి నుంచి పాయింట్లు రాబట్టి ఆరో గ్రాండ్ స్లామ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. వింబుల్డన్ లో ఆమెకు ఇదే తొలి టైటిల్.

వింబుల్డన్ ఫైనల్లో స్వియాటెక్ డబుల్ బాగెల్ సాధించింది. అంటే రెండు సెట్లలోనూ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజయం అందుకుంది. 1988 ఫ్రెంచ్ ఓపెన్ లో నటాషా జ్వెరెవాను ఓడించిన స్టెఫీ గ్రాఫ్ తర్వాత డబుల్ బాగెల్ తో మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రీడాకారిణిగా స్వియాటెక్ హిస్టరీ క్రియేట్ చేసింది. ...