భారతదేశం, జూలై 23 -- వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. చివరగా ఆస్ట్రేలియాతో టీ20తో అతను కెరీర్ ముగించాడు. లాస్ట్ అంతర్జాతీయ మ్యాచ్ లోనూ సిక్సర్ల మోత మోగించాడు. వెస్టిండీస్ సహచరులు, ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అతనికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.

రసెల్ చివరిసారిగా వెస్టిండీస్ జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాడు. జమైకా క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఒలివియా గ్రేంజ్ అతనికి జ్ఞాపికను అందజేశారు. ఇది ఒక ప్రత్యేక ఆటగాడికి ప్రత్యేక సందర్భం. గంట తర్వాత, టీ20 క్రికెట్లో లెజెండ్‌గా ఎదిగిన ఆండ్రీ రసెల్ తాను ఎందుకు అంతర్జాతీయంగా సూపర్‌స్టార్‌నో అని చూపించాడు.

వెస్టిండీస్ 14వ ఓవర్లో 98 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన రస్సెల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో సింగిల...