భారతదేశం, ఫిబ్రవరి 13 -- దేశంలోనే అతిపెద్ద వింటేజ్ కార్ల ర్యాలీ, ప్రదర్శన దిల్లీలో జరగనుంది. 21 గన్ సెల్యూట్ కాంకోర్స్ డి'ఎలిగాన్స్ 11వ ఎడిషన్ ఫిబ్రవరి 21 నుండి 23 వరకు దిల్లీ ఎన్‌సీఆర్‌లో జరగనుంది. 125 అరుదైన వింటేజ్ కార్లు, 50 హెరిటేజ్ మోటార్ సైకిళ్లను చూడొచ్చు. వచ్చే వారం ఫిబ్రవరి 21న ఇండియా గేట్ నుండి ప్రారంభమై గురుగ్రామ్‌లోని యాంబియన్స్ గ్రీన్స్‌కు వింటేజ్ కార్లు, మోటార్ సైకిళ్లు చేరుకుంటాయి.

ఈ కార్యక్రమంలో అరుదైన కార్లను ప్రదర్శిస్తారు. అలాగే ఆటోమొబైల్ ప్రియుల కోసం భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. కథక్, భరతనాట్యం, కథకళి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా జానపద నృత్యాలు కూడా ప్రదర్శిస్తారు.

1939 డెలాహాయే (ఫిగోని ఎట్ ఫలాస్చి) వంటి ప్రత్యేకమైన కార్లు 21 గన్ సెల్యూట్ కాంకోర్స్ డి'ఎలిగాన్స్ 2025...