భారతదేశం, మే 10 -- ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చినా టోల్‌ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా, మరింత సులభంగా టోల్‌ వసూలయ్యేలా శాటిలైట్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై.. ఏపీలో చిల్లకల్లు(నందిగామ) తెలంగాణలో పంతంగి(చౌటుప్పల్‌), కొర్లపహాడ్‌(కేతేపల్లి), టోల్‌ ప్లాజాల వద్ద ప్రస్తుతం శాటిలైట్‌ ద్వారా టోల్‌ వసూలు చేస్తున్నారు.

శాటిలైట్ విధానం ద్వారా వాహనం ఆగనవసరం లేకుండానే టోల్‌ దానికదే వసూలవుతోంది. దీంతో వాహనాలకు ఫాస్టాగ్‌ లేకున్నా టోల్‌ చెల్లింపు ఎలా జరిగింది.. అని వాహనదారులు ఆశ్చర్యపోతున్నారు. జాతీయ రహదారులపై వాహనదారులు ప్రయాణించిన దూరం మేరకే టోల్‌ వసూలు చేసేలా జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను తీసుకొస్తామని.. గతంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కర...