భారతదేశం, ఏప్రిల్ 29 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన కారణంగా మే 2, 2025న రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు చేసినట్లు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

మే 2, 2025న ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. అమరావతిలో శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, బహిరంగ సభ సజావుగా సాగడానికి జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ట్రాఫిక్ మళ్లింపులు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపులు (భారీ, ఇతర వాహనాలతో సహా) :

1. చెన్నై వైపు నుండి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపునకు వెళ్లే భారీ గూడ్స్ వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుంచి చీరాల- బాపట్ల - రేపల్లె - అవనిగడ్డ- పామర్రు-గుడివాడ- హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం...