Hyderabad, జూలై 12 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఏ ఇబ్బంది కూడా రాదు. ఇంటిని నిర్మించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాస్తు ప్రకారం వారి ఇంటిని నిర్మిస్తారు. అలా చేయడం వలన సమస్యలు రావని నమ్ముతారు. అదే విధంగా ఇంట్లో ఉన్న వస్తువులను కూడా వాస్తు ప్రకారం పెడతారు.

సమయం చాలా విలువైనది. ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో గడియారాలు పెడుతూ ఉంటారు. కాలాన్ని మించిన శక్తివంతుడు లేడని మత గ్రంథాలలో చెప్పబడింది. కాలం రాజును బిచ్చగాడిలా మార్చుతుంది. అదే కాలం బిచ్చగాడిని రాజుగా కూడా మార్చగలదు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో చెడు పరిస్థితులు ఎదుర్కోకూడదని అనుకుంటారు.

వాస్తు శాస్త్రంలో సమయాన్ని తెలిపే గడియారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంట్లో గడియారాన్ని పెట్టేటప్పుడు సరై...