Hyderabad, ఆగస్టు 29 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన శుభ ఫలితాలను కూడా పొందవచ్చు. అయితే, చాలా మంది వారి ప్రేమను వ్యక్తపరచడానికి ఇతరులకు బహుమతులు ఇస్తూ ఉంటారు. బహుమతులు ఇచ్చేటప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు.

వాస్తు ప్రకారం కొన్ని బహుమతులు ఇవ్వడం మంచిది కాదు. దాని వలన దురదృష్టం కలుగుతుంది, ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎలాంటి బహుమతులు ఇవ్వడం మంచిది కాదు? దాని వలన ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడూ ఎవరికీ నల్లటి దుస్తులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. నిజానికి నలుపు రంగు దుస్తులు వేసుకోవడం ప్రతికూల శక్తిని కలిగిస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో నలుపును శుభ చిహ్నంగా భావ...