భారతదేశం, నవంబర్ 11 -- ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలని అనుకుంటారు. అయితే కొన్ని సార్లు వచ్చినట్టే డబ్బు తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎంతో కాలం అది మన దగ్గర నిలవదు. అయితే డబ్బు అలా నిలవకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా.. చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలా మంది రకరకాల పరిహారాలని పాటిస్తూ ఉంటారు. అయితే, కొంత మందికి ఆకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోవడం, ఇంటి శ్రేయస్సు ఆగిపోవడం వంటివి చూస్తూ ఉంటారు.

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవాలి. అలాగే ఇంట్లో సానుకూల శక్తి, ఆనందం, శాంతి, స్థిరత్వం కూడా ఉండాలి. విభేదాలు రావడం, మానసిక ఒత్తిడితో సతమతం అవ్వడం వంటివి లేకుండా ఉండాలంటే కొన్ని పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస...