Hyderabad, సెప్టెంబర్ 8 -- ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహించే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఫ్యామిలీ ఫోటోలను చాలా మంది ఇళ్లల్లో పెడుతూ ఉంటారు. ఫ్యామిలీ ఫోటోలను పెట్టేటప్పుడు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం మంచిది. ఫ్యామిలీ ఫోటోలు కేవలం జ్ఞాపకాలు కాదు, అవి ప్రేమ, కనెక్షన్ మొదలైన వాటికి చిహ్నం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఫ్యామిలీ ఫోటోలు ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది. అయితే వాటిని పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలనేది చాలా ముఖ్యం.

మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి బంధం దృఢంగా ఉండాలనుకుంటున్నారా? అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యామిలీ ఫోటోలను ఏ దిశలో పెడితే మంచిదో తెలుసుకోండి.

లివింగ్ రూమ్ లో ఎక్కువగా కలిసి అందరూ కూర్చుని మాట్లాడుకుంట...