భారతదేశం, డిసెంబర్ 2 -- చాలా మంది ఇళ్లల్లో నచ్చిన మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. మొక్కలు కేవలం అందానికే కాక, కొన్ని రకాల దోషాలను తొలగించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, సానుకూల శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. వాస్తు ప్రకారం, ఇంట్లో ఈ మొక్కలు ఉన్నట్లయితే ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.

వాస్తు ప్రకారం పాటిస్తే చాలా ఇబ్బందులను తొలగించేందుకు వీలవుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కూడా ఏర్పడుతుంది. ప్రతికూల శక్తి పూర్తిగా తొలగి పోతుంది. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంటుంది. కుజ దోషం, రాహు, కేతువుల దోషం, సూర్య దోషం, మాంగల్య దోషం, పుత్ర దోషం వంటివి కూడా తొలగిపోతాయి.

ఇంట్లో అరటి చెట్టుని నాటడం వలన వివాహంలో అడ్డంకులు తొలగి పోతాయి. ఆనందంగా ఉండొచ్చు. అరటి చెట్టును ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్...