Hyderabad, అక్టోబర్ 3 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అందుకే చాలా మంది ఇంట్లో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ప్రశాంతత, సంతోషం కూడా ఉంటాయి. పడకగదిలో కూడా కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి. వాస్తు ప్రకారం పడక గదిలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? ఏవి ఉంటే సమస్యలు వస్తాయి వంటి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది మంచానికి ఎదురుగా అద్దం పెడుతూ ఉంటారు. నిజానికి అది చాలా పెద్ద పొరపాటు. ఎప్పుడూ కూడా మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అది ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, మానసిక ఒత్తిడిని పెంచుతుంది. నిద్ర కూడా పట్టదు.

ఒకవేళ మంచానికి ఎదురుగా ఉన్న అద్దాన్ని తొలగించడం కుదరకపోతే, రాత్రి నిద్రపోయే ముందు ఒక క్లాత్‌తో అద్దాన్ని కవర్ చేయండి. లేదంటే పడక గదిలో వేరే దిశక...