Hyderabad, జూలై 16 -- వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఏ ఇబ్బంది రాదు, సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఇంట్లో ప్రశాంతత కలగాలని, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఈ వాస్తు చిట్కాలను పాటించండి. వీటిని పాటించడం వలన ప్రతికూల శక్తి కలగదు. ఇంటి ప్రశాంతత కోసం ఈ మూడు వాస్తు చిట్కాలను తప్పక పాటించండి.

ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఇంట్లో ప్రతి మూలకు జీవం పోసేలా రకరకాల వస్తువులను పెడుతుంటారు. ఫర్నిచర్, మొక్కలు, పెయింటింగ్స్ ఇలా ఎన్నో వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే, ఇంటి అందాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది వాస్తు నియమాలను పాటించరు. కానీ, వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది, ...