Hyderabad, సెప్టెంబర్ 22 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన మరో లేటెస్ట్ మూవీ ఓజీ. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా జోడీ కట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్‌ రోల్ ప్లే చేశాడు.

ఓజీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25న ఓజీ మూవీ గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయితే, పవన్ కల్యాణ్ తన సినిమాల్లో కొన్నిసార్లు పాటలు పాడి ఎంతో అలరించారు. వాటిలో కాటమరాయుడు సాంగ్, నారాజు గాకురా మా అన్నయ్య పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి.

ఇప్పుడు ఈ ఓజీ సినిమాలో కూడా పవన్ కల్యాణ్ ఓ పాట పాడారు. అదే జపనీస్ హైకూ (చిన్న కవిత) వాషి యో వాషి. జపనీస్ పదాలతో అల్లుకున్న ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో ...