భారతదేశం, డిసెంబర్ 27 -- లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ధురంధర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ సినిమా ముచ్చట్లే కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఈ చిత్రం గురించే మాట్లాడుతున్నారు. తాజాగా నాగ చైతన్య భార్య శోభితా ధూళిపాళ కూడా ధురంధర్ సినిమాపై మనసు పారేసుకుంది. మూవీ తెగ నచ్చేసిందని రివ్యూ ఇచ్చేసింది.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేయడంతో పాటు ప్రముఖుల ప్రశంసలను అందుకుంటోంది. ఇప్పుడు, నటి శోభితా ధూళిపాళ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది. రణవీర్ సింగ్, సారా అర్జున్ యాక్టింగ్ కు ఆమె ఫిదా అయిపోయింది.

శోభితా ధూళిపాళ శనివారం (డిసెంబర్ 27) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ధురంధర్ ను ప్రశంసించింది. ''వావ్. వావ్. వావ్. ఉత్కంఠభరితమైనది. మైండ్ బ్లోయింగ్. స్ఫూర్తిదాయకం. మిగతా వాటిలా కాదు. సుప...