భారతదేశం, సెప్టెంబర్ 6 -- స్టార్ నటి సమంత రూత ప్రభు ఓ సినిమాపై ప్రశంసలు కురిపించింది. వావ్ అంటూ రివ్యూ ఇచ్చింది. మరో హీరోయిన్ ను తెగ పొగిడేసింది. ఆ సినిమానే 'లోకా చాప్టర్ 1 చంద్ర'. ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరోగా కల్యాణి ప్రియదర్శన్ నటించిన మలయాళ చిత్రం ఇది. గత వారం థియేటర్లలో విడుదలైనప్పటి నుండి ప్రశంసలు అందుకుంటోంది.

నటి, నిర్మాత సమంత రూత్ ప్రభు.. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన లోకా చాప్టర్ 1 చంద్ర చిత్రంపై ప్రశంసలు కురిపించింది. కల్యాణిని చంద్రగా చూసి తనకు 'గూస్‌బంప్స్' వచ్చాయంది. సమంత 'లోకాః చాప్టర్ 1' రివ్యూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇలా రాసింది.

"లోకా చూశాను.. వావ్!!! ఎంత అద్భుతమైన అనుభవం. విజువల్స్, సౌండ్, యాక్షన్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ సజీవంగా అనిపించింది. ఈ సినిమా నన్ను పూర్తిగా ఆకట్టుకుంది. కానీ నన్ను కట్...