భారతదేశం, ఫిబ్రవరి 8 -- సీనియర్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన మూవీ 'సీతా పయనం'. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ కూడా అతనే. తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. విష్వక్ సేన్ ఫంకీ మూవీ గురించి మాట్లాడాడు.

అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన మూవీ సీతా పయనం. ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. మరోవైపు విష్వక్ సేన్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఫంకీ ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు క్లాష్ కానున్నాయి.

ఫంకీ సినిమాతో తన సినిమా సీతా పయనం పోటీ పడటం పట్ల అర్జున్ సర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సీతా పయనం సినిమాలో ముందు హీరోగా విష్వక్...