భారతదేశం, డిసెంబర్ 27 -- సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'కూలీ' (Coolie) ఆగస్టు 14న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథలో దమ్ము లేదని, రైటింగ్ వీక్‌గా ఉందని విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా రూ. 500 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా దీనిపై స్పందించిన లోకేష్.. విమర్శలను స్వీకరిస్తున్నానని, రజనీకాంత్ వల్లే సినిమా ఆడిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

భారీ అంచనాల మధ్య విడుదలైన 'కూలీ' సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎట్టకేలకు మౌనం వీడాడు. శుక్రవారం (డిసెంబర్ 26) సాయంత్రం అతడు మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సినిమా స్క్రిప్ట్ గురించి వచ్చిన కామెంట్స్ పై లోకేష్ స్పందిస్తూ.. "'కూలీ' సినిమాపై వేలల్లో విమర్శలు వచ్చాయి. అవన్నీ గమనించాను. నా తర్వాతి సినిమాలో ఆ తప్ప...