భారతదేశం, జనవరి 10 -- యశ్ లేటెస్ట్ సినిమా 'టాక్సిక్' టీజర్‌లోని ఓ ఇంటిమేట్ సీన్‌పై రేగిన దుమారానికి దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ చెక్ పెట్టింది. "స్త్రీల ఆనందం, సమ్మతి గురించి జనం ఇంకా చర్చిస్తూనే ఉన్నారు.. నేను మాత్రం చిల్ అవుతున్నా" అంటూ విమర్శలకు ఘాటుగా బదులిచ్చింది. దీనిపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించగా.. సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజు కానుకగా జనవరి 8న విడుదలైన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) టీజర్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. అయితే ఇందులో యశ్ కనిపించిన తీరు కంటే.. టీజర్‌లో చూపించిన ఒక బోల్డ్ సీన్ పైనే ఇప్పుడు రచ్చ జరుగుతోంది.

బయట తుపాకుల మోత మోగుతుండగా.. కారులో హీరో రాయ (యశ్), ఓ యువతితో శృంగారంలో పాల్గొంటున్నట్లు చూపించిన షాట్ తీవ్ర చర్చనీయాంశ...