Hyderabad, ఆగస్టు 22 -- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించిన ముద్దుగుమ్మ మధు శాలిని. తాజాగా మధు శాలిని సమర్పణలో వస్తున్న న్యూ మూవీ కన్యా కుమారి. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన కన్యా కుమారి సినిమాకు సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం వహించారు.

రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సజన్ అట్టాడ నిర్మాతగా రూపొందిన కన్యా కుమారి సినిమాలో శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని హీరో హీరోయిన్లుగా నటించారు. ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో రీసెంట్‌గా కన్యా కుమారి ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

కన్యా కుమారి ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా హీరో సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ శశి కిరణ్ తిక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్యా కుమారి ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ మధు శాలిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మూవీ ప్రజెంటర్, హీర...