భారతదేశం, ఆగస్టు 15 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీలో పరిస్థితులు అనుకూలించకపోతే భారత్‌పై సుంకాలు పెరుగుతాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెంట్ హెచ్చరించారు. ఇద్దరి మధ్య మీటింగ్‌లో తేడా వస్తే సుంకాలు మరింత పెరుగుతాయని చెప్పారు. భారత్‌పై మొత్తం 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ గత వారం ప్రకటించారు. ఇందులో రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తే జరిమానాగా విధించిన 25 శాతం సుంకం కూడా ఉంది. ఈ నెల 27 నుంచి అదనంగా 25 శాతం సుంకం అమల్లోకి రానుంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల అందరూ విసిగిపోయారని తాను భావిస్తున్నానని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెంట్ బ్లూమ్ బర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 'రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నందుకు మేం భారతీయులపై అదనపు సుంకాలు విధించాము. ట్రంప్,...