భారతదేశం, జనవరి 8 -- 'బోర్డర్ 2' (Border 2) సినిమాలోని 'ఘర్ కబ్ ఆవోగే' పాట రిలీజ్ అయినప్పటి నుంచి హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. పాటలో వరుణ్ హావభావాలు బాగోలేవంటూ మీమ్స్ వస్తున్నాయి. అయితే ఇదంతా కావాలని, డబ్బు తీసుకొని చేస్తున్న తప్పుడు ప్రచారం అని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన నిర్మాత నిధి దత్తా ట్రోలర్లపై మండిపడింది. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరుడి పాత్రను పోషిస్తున్న నటుడిపై ఇలాంటి కుట్రలు చేసేవాళ్లు 'దేశద్రోహులు' (యాంటీ నేషనల్స్) అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ నటిస్తున్న బోర్డర్ 2 ఓ భారీ మల్టీస్టారర్. ఈ సినిమాపై నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని మేకర్స్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని మరీ వరుణ్ ధావన్‌ను టార్గెట్ చ...