Hyderabad, ఏప్రిల్ 25 -- సింగర్ చిన్మయి శ్రీపాద తెలుసు కదా. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కడం ఈమెకు అలవాటే. తాజాగా దేశమంతా సెలబ్రిటీలతో సహా జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. కానీ చిన్మయి మాత్రం అదే సమయంలో అగ్ర కులాల వారిని ఉగ్రవాదులతో పోల్చుతూ ఓ పోస్ట్ చేసింది. దీనిపై ప్రస్తుతం పలువురు మండిపడుతున్నారు.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు పోస్టులు చేస్తున్నారు. అయితే సింగర్ చిన్మయి శ్రీపాద మాత్రం దేశంలో కులం పేరుతో అవతలి వాళ్లను చిన్నచూపు చూసే వాళ్లు కూడా ఉగ్రవాదులతో సమానమే అంటూ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో ఏముందో చూడండి.

"నేను ఓ నిమ్న కులానికి చెందిన అంటే షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తిని. హిందువులమని చెప్పుకునే వా...