భారతదేశం, ఫిబ్రవరి 14 -- చాలామంది వాలెంటైన్స్ డేకు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమించిన వారికి లేదా జీవిత భాగస్వామికి కూడా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పి గిఫ్ట్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు కూడా వాలెంటైన్స్ డేకు గిఫ్ట్ కొనేశారా? ఈ గిఫ్ట్స్ మాత్రం ఇవ్వకూడదు. వీటిని బహుమతిగా ఇస్తే మాత్రం సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం కొన్ని బహుమతులు పొరపాటున కూడా ఇవ్వకూడదు. ఈ బహుమతులు ఇవ్వడం ఎంతో అశుభం.

ప్రేమికుల రోజు నాడు ప్రేమను వ్యక్తపరచేందుకు ఇష్టపడిన వారికి బహుమతులు ఇస్తూ ఉంటారు. వాలెంటైన్స్ డే నాడు ఈ బహుమతులు ఇస్తే మాత్రం వాస్తు ప్రకారం శుభ ఫలితాలు ఎదురవవు. మరి ఎలాంటి బహుమతులను ఇవ్వకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.

వెండి ఆభరణాలు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మీ భాగస్వామికి లేదా ఇష్టమైన వ్యక్తికి ఇస్తే బ్రేకప్‌కు కారణం అవ్వచ్చన...