Hyderabad, ఆగస్టు 15 -- చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాల్లో అత్యంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే బాక్సాఫీస్ క్లాష్ ఇది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2, 74 ఏళ్ల సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా రెండు ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగిన విషయం తెలిసిందే.

ఆగస్ట్ 14న థియేటర్లలో వార్ 2, కూలీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండింటికి రెండు డిఫరెంట్ అండ్ క్యూరియాసిటీ పెంచే సినిమాలే. అయితే, రెండింట్లో వార్ 2ని కూలీ బీట్ చేసేసింది. అటు హిందీలో హృతిక్ రోషన్, ఇటు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని రజనీకాంత్ స్టార్‌డమ్ వెనక్కి నెట్టేసింది.

తొలిరోజున ఇండియాలో నెట్ కలెక్షన్స్‌లో వార్ 2 కంటే రజనీకాంత్ కూలీకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఓపెనింగ్ డే నాడు వార్ 2 సినిమాకు ...