భారతదేశం, జూలై 25 -- హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన వార్ 2 ట్రైలర్ శుక్రవారం (జులై 25) విడుదలైంది. ఇది యాక్షన్, డ్రామా, ఎమోషన్‌లతో నిండిన రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంది. ప్రాణాలకు తెగించి చేసే స్టంట్స్, ఉత్కంఠభరితమైన పోరాటాలు, ఉత్తేజకరమైన సన్నివేశాలతో అదిరిపోయింది ట్రైలర్. ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ స్పై థ్రిల్లర్ థియేటర్లలో విడుదల కానుంది. హృతిక్ భారతీయ సూపర్ స్పై కబీర్ పాత్రను తిరిగి పోషిస్తున్నాడు.

హృతిక్ రోషన్, కియారా అద్వానీల ముద్దు సీన్ వార్ 2 ట్రైలర్ లో అభిమానులను థ్రిల్ చేసింది. ముఖ్యంగా కియారా అద్వానీ పాత్రను విస్తృతంగా చూపించారు. టీజర్‌లో బికినీలో కనిపించిన దానికంటే భిన్నంగా, ట్రైలర్ లో ప్రేక్షకులకు ఆమె క్యారెక్టర్.. హృతిక్ రోషన్ పాత్ర కబీర్‌తో రొమాంటిక్ కెమిస్ట్రీని చూపిస్తుంది. ఈ జంట కలిసి ప్...