Hyderabad, జూలై 25 -- యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సినిమా వార్ 2. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, హాట్ బ్యూటీ కియారా అద్వానీ జోడీ కట్టిన ఈ సినిమాలో తారక్ విలన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. వార్ 2 సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది.

తాజాగా ఇవాళ శుక్రవారం (జూలై 25) వార్ 2 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వార్ 2 ట్రైలర్ ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పిస్తూ అదిరిపోయింది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు చుట్టూనే ట్రైలర్ సాగింది. వారి స్క్రీన్ ప్రజెన్స్ అబ్బురపరిపిచింది.

హృతిక్ రోషన్‌తో కియారా లిప్ లాక్ సీన్‌తోపాటు చేసిన యాక్షన్ సీన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. హృతిక్, జూనియర్ ఎన్టీఆర్, కియారా యాక్షన్ సీక్వెన్స్ పిచ్చికెక్కించేలా ఉన్నాయి. ఇ...